చొప్పదండి, జనవరి 23: బ్రెయిన్‌డెడ్ అయిన మహిళ అవయవాలను దానం చేసేందుకు ఆ కుటుంబసభ్యులు అంగీకరించి ఆదర్శంగా నిలిచారు. చొప్పదండి మండలంలోని వెదురుగట్ట గ్రామానికి చెందిన పెంచాల సరోజ(55)కు శనివారం విపరీతమైన తలనొప్పి రావడంతో కు టుంబసభ్యులు కరీంనగర్ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు సరోజ మెదడులో రక్తం గడ్డ కట్టిందని, మెరుగైన చికి త్స కోసం హైదరాబాద్‌కు తరలించాలని సూ చించారు. దీంతో ఆమెను సికింద్రాబాద్‌లోని కిమ్స్ దవాఖానకు తీసుకెళ్లారు.
సరోజను రక్షించేందుకు వైద్యులు శ్రమించినా దురదృష్టవశా త్తు ఆదివారం ఉదయం బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందింది. అవయదానంపై కిమ్స్‌లోని అవయదాన సమన్వయకర్తలు బాధిత కుటుం బ సభ్యులు, బంధువులకు అవగాహన కల్పించారు. దీంతో కళ్లు, కిడ్నీలు, లివర్ ఇచ్చేం దుకు అంగీకరించారు. తాను చనిపోతూ మరో ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపినందుకు గర్వం గా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు.
మృ తురాలికి భర్త కొమురయ్య, ఇద్దరు కుమారులు దామోదర్, రమేశ్, కుమార్తె అనూష ఉ న్నారు. ఒక కొడుకు పోలీస్ విభాగంలో పనిచేస్తున్నా డు. పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ వారు తీసుకున్న నిర్ణయానికి తోటి ఉద్యోగులు, వెదురుగట్ట గ్రామస్తులు అభినందించారు. జీవన్ దాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ చానల్ ద్వారా అవసరం ఉన్నచోటికి అవయవాలను తరలించారని సభ్యులు తెలిపారు.