సందేహాల నివృత్తికి ‘చెక్ లిస్ట్’
బూత్‌ల్లో బారులు తీరిన ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకొనేందుకు ఎంతవరకు సమయం ఇవ్వాలి..? ఏదేని పరిస్థితుల్లో ఈవీఎంలు మొరాయిస్తే ఏంచేయాలి..? ఓటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఏవిధంగా ఈవీఎంలకు ఏవిధంగా సీల్ వేయాలి..? తరచూ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి వచ్చే సందేహాలు..
- సిబ్బంది అనుమానాలను నివృత్తి చేసేందుకు బుక్లెట్
- రూపొందించిన ఎలక్షన్ కమిషన్
- కరదీపికలతో పాటు పంపిణీ
బూత్‌ల్లో బారులు తీరిన ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకొనేందుకు ఎంతవరకు సమయం ఇవ్వాలి..? ఏదేని పరిస్థితుల్లో ఈవీఎంలు మొరాయిస్తే ఏంచేయాలి..? ఓటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఏవిధంగా ఈవీఎంలకు ఏవిధంగా సీల్ వేయాలి..? తరచూ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి వచ్చే సందేహాలు.. ఇలాంటి అనుమానాలకు చెక్ పెట్టేందుకు ఎలక్షన్ కమిషన్ వినూత్న విధానానికి రూపకల్పన చేసింది. చెక్‌లిస్ట్ పేరిట ఓ బుక్‌లెట్‌ను రూపొందించింది. వీటిని విధుల్లో పాల్గొనే పీవో, ఏపీవోలకు కరదీపికలతో పాటు అందించేందుకు చర్యలు చేపడుతున్నది.
– కలెక్టరేట్, ఏప్రిల్ 21
ఓటింగ్ సమయంలో ఎలాక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మొరాయించినా, పోలింగ్ సమయం దాటినా క్యూలైన్లలో అనేక మంది ఓటర్లు బారులు తీరిన సందర్భాల్లో ఏ విధంగా వ్యవహరించాలో తెలియక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడేది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం గందరగోళ పరిస్థితులు తొలగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఎన్నికల విధులు, ఓటర్ల జాబితాల పరిశీలన, ఈవీఎంల తరలింపు ప్రక్రియ తదితర అంశాలతో కూడిన వివరాలతో కరదీపికను రూపొందించింది.
ఇప్పుడు ఎన్నికల నిబంధనలు, విధి నిర్వహణపై ప్రత్యేక చెక్‌లిస్ట్‌తో కూడిన బుక్లెట్లను తయారు చేసింది. ఇందులో ముఖ్యంగా ప్రిసైడింగ్ అధికారుల విధులు, పోలింగ్‌కేంద్రం వద్ద ఏర్పాట్లు, మాక్ పోలింగ్, ఏజెంట్ల నియామకం, ఈవీఎంల నిర్వహణ, మొరాయించినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలింగ్ సమయంలో పాటించాల్సిన సూచనలు, పోలింగ్ ముగింపు, నమోదైన మొత్తం ఓట్లు, బీయూలను సీల్ చేసే విధానం, తదితర అంశాలకు సంబంధించిన సంపూర్ణ సమాచారం నిక్షిప్తంచేశారు. దీంతో విధుల్లో పాల్గొనే సిబ్బంది ఇబ్బందులు తొలగనుండగా, పోలింగ్ ప్రక్రియకు కూడా అంతరాయం లేకుండా సజావుగా జరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
చేయాల్సినవి…చేయకూడనివి..
ఎన్నికల విధుల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకునే క్రమంలో సిబ్బంది విధుల్లో భాగంగా చేయాల్సినవి, చేయకూడనివి పేరిట హాండ్ బుక్‌లు ముద్రించి శిక్షణ సమయంలో అందజేశారు. ఇప్పటికే మొదటి విడుత శిక్షణ పూర్తి కాగా, మరో రెండు విడుతల్లో వీరికి శిక్షణ ఇవ్వనున్నారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్ల నేపథ్యంలో ఈసారి పోలింగ్, లెక్కింపు సందర్భాల్లో అత్యంత అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎన్నికల క్రతువు ముగించేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతుండడంపై ఓటర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

