Bonala Festivel | హుజురాబాద్ టౌన్, జూలై 19: పట్టణంలోని న్యూ కాకతీయ మోడల్ స్కూల్ లో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బద్దుల రాజ్ కుమార్, డైరెక్టర్లు తవుటం గోపాల్, మాసాడి వెంగళరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో రంగ వల్లులు, మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు.
ఉపాధ్యాయినీలు, విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో బోనం కుండలకు పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించుకొని బోనాలు ఎత్తుకొని బోనాల పాటలు, నృత్యాలతో విద్యార్థులు అలరించారు. పోతరాజుల వేషధారణలో విద్యార్థులు చూపరులను కనువిందు చేశారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ విద్యార్థులలో ఆధ్యాత్మికత పెంపొందించేందుకు బోనాల పండుగ ఎంతగానో ఉపయోగపడుతుందని అని అన్నారు.
మన సంస్కృతి, సాంప్రదాయాలను విద్యార్థులు కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రమేష్, శ్రీనివాస్, రమేష్, సమ్మయ్య, ఉపేంధీర, మానస, ఆశ, మౌనిక, అశ్విని, రమా, సంధ్య, సరిత, సుకన్య తదితరులు పాల్గొన్నారు.