చిగురుమామిడి, అక్టోబర్ 28: బొమ్మనపల్లి గ్రామస్తులు రోడ్డెక్కారు. ఐకేపీ (సెర్ఫ్) కొనుగోలు కేంద్రానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గ్రామంలోని బస్టాండ్ వద్ద రాస్తారోకో చేశారు. దీంతో హుస్నాబాద్ నుంచి హుజూరాబాద్ వెళ్లే వాహనాలు ఎకడికకడే నిలిచిపోయాయి.
సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ ముద్దసాని రమేశ్, ఎస్ఐ సాయి కృష్ణ, ఇరిగేషన్ ఏఈ నెహ్రూ గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై నివేదికను రెండు రోజుల్లోగా కలెక్టర్కు అందజేస్తామని వారు గ్రామస్తులకు హామీ ఇవ్వగా, ఆందోళన విరమించారు. ప్రభుత్వం సమస్యను పరిషరించకుంటే తహసీల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.