Palakurthi | పాలకుర్తి : ఫొటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ పాలకుర్తి మండల అధ్యక్షుడిగా బొల్లి సాయిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫొటో వీడియో గ్రాఫర్స్ సమావేశాన్ని మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా బొల్లి సాయిరాజ్, ప్రధాన కార్యదర్శిగా పికిలింక శ్రీనివాస్, కోశాధికారిగా గుండ మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లెర్ల ఉదయ్, జిల్లా అధ్యక్షుడు పోగుల విజయ్ కుమార్, సీనియర్ ఫొటోగ్రాఫర్లు తాజొద్దీన్, మాజీ అధ్యక్షులు వైద్య నరేష్, భూమయ్య, ప్రకాష్, లక్ష్మణ్, కిషన్, శివతో పాటు పలువురు పాల్గొన్నారు.