సిరిసిల్ల /సిరిసిల్ల టౌన్, నవంబర్20: మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్ర మ, పట్టణానికి మహర్దశ వచ్చిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ భవన్లో సిరిసిల్ల పట్టణ బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులు ప్రచారంలో చెప్పే కల్లబొల్లి మాటలను తిప్పికొట్టాలన్నారు. తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అన్నారని.. కేసీఆర్ నాయకత్వంలో 24గంటల విద్యుత్ అందిస్తున్నామని వివరించాలన్నారు. తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వలేదని, గులాబీ జెండా దండుగా కదిలి రాష్ర్టాన్ని సాధించుకున్నదన్నారు.
రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే సీఎం కావడంతో రైతుల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని పండుగలా చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు గంటల కరెంట్చాలంటూ.. వ్యవసాయంపై కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. 10హెచ్‌పీ మోట ర్లు వ్యవసాయానికి వినియోగిస్తారా అంటూ ఎద్దేవాచేశారు. సీఎం కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నంతో గోదావరి జలాలను సిరిసిల్లకు ఎదురెక్కించి తంగళ్లపల్లి-సిరిసిల్ల వంతెన కింద శాశ్వత జలకళను తెచ్చారన్నారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచ శివారులో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆక్వాహబ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించా రు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సిరిసిల్ల డివిజన్ కేంద్రం, జిల్లాగా మారిందని, ప్రజలకు పాలన చేరువైందన్నారు. ఈ క్రమంలోనే విశాలమైన ప్రాంగణంలో కలెక్టరేట్ భవనాన్ని, జిల్లా పోలీసు కార్యాలయాలు నిర్మించి అందుబాటులోకి తెచ్చారన్నారు.
ఒకప్పుడు వరంగల్, హైదరాబాద్ వంటి మహా నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఇంజినీరింగ్, మెడికల్ విద్య నేడు సిరిసిల్లలో ఏర్పాటు చేసి మన పిల్లలకు ఉన్నత విద్య అవకాశాలను అందిస్తున్నారన్నారు. అలాగే నర్సింగ్ కళాశాల, వ్యవసాయ, వ్యవసాయ పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాల, గంభీరావుపేటలో కేజీ టూ పీజీ విద్యాలయాల సముదాయం ఏర్పాటు కావడంతో సిరిసిల్ల ఎడ్యుకేషన్ హబ్‌గా మారిందన్నారు. సిరిసిల్ల-కరీంనగర్-కామారెడ్డి రహదారులను విస్తరించి సెంటర్ లైటింగ్‌ను ఏర్పాటు చేసి, ఈ ప్రాంతానికే వన్నె తెచ్చారని కొనియాడా రు. నాడు ఎట్లుండే సిరిసిల్ల.. నేడు ఎట్లయ్యిం దో.. మన కళ్లముందే కనిపిస్తున్నదన్నారు.
గత పాలకుల హయాంలో వస్త్ర పరిశ్రమకు సరైన విద్యుత్ లేక దుర్భరమైన పరిస్థితి ఉండేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్న నిరంతర విద్యుత్ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో వెలుగులు నింపిందని చెప్పారు. తెలంగాణకే తలమానికంగా మంత్రి కేటీఆర్ సిరిసిల్లను తీర్చిదిద్దారని కొనియాడారు. నేతన్న కార్మికులకు బతుకమ్మ చీరెలతో ఉపాధి కల్పిస్తున్నారన్నారు. నాడు ఉరిసిల్లగా ఉన్న సిరిసిల్ల నేడు సిరులఖిల్లాగా వర్ధిల్లుతోంది.. కార్మికులను యజమానులుగా చూడాలన్న లక్ష్యంతో వర్క్ టూ ఓనర్ పథకంలో భాగంగా రెండో బైపా స్ రోడ్డులో అప్పారెల్ పార్కును ఏర్పాటు చేస్తు న్నాం.. త్వరలోనే సిరిసిల్లలో లా కళాశాల ఏర్పా టు చేస్తామని హామీఇచ్చారు.
తెలుపు రేషన్ కార్డుదారులకు కేసీఆర్ బీమా పథకం ఎంతో దోహదం చేస్తున్నదని తెలిపారు. బుల్లెట్ కంటే ఓటు విలువైందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొం డూరి రవీందర్రావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్‌చైర్మన్ మంచె శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, సీనియర్ నేత బొల్లి రామ్మోహన్, మున్సిపల్ కౌన్సిలర్లు, బూత్ స్థాయి కమిటీల ఇన్చార్జిలు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.