వేములవాడ, ఏప్రిల్ 9: ఇది ఎన్నికల సమయమని, వచ్చే డిసెంబర్ మాసంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మరోసారి వంద సీట్లు సాధించి తీరుతామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సంగీత నిలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ స్థాయి కార్యకర్త నుంచి మండల స్థాయి వరకు ప్రతి ఒక రూ పండుగ వాతావరణంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకుంటున్నామన్నారు. ప్రతి ఆత్మీయ సమ్మేళనంపై పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ఎమ్మెల్యేలు వివరిస్తూనే వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. చాలాచోట్ల ఎమ్మెల్యేలను మారుస్తారన్న వస్తున్న వార్త ల్లో నిజం లేదని కొట్టి పారేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చీటికిమాటికి ఎమ్మెల్యే అభ్యర్థులను మా ర్చరని, వేములవాడ బరిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా చెన్నమనేని రమేశ్‌బాబు పోటీలో ఉంటారని తెలిపారు. వారం రోజుల్లో వేములవాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఆత్మీయ సమ్మేళనాలు పూర్తవుతాయని చెప్పారు.
వేములవాడ ప్రభుత్వ దవాఖాన పనితీరుపై సీఎం కేసీఆర్‌కు కూడా వివరించామని, ఆయన ఎంతో ఆనందపడ్డారని చెప్పా రు. 2014లో తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలు పట్టం కట్టారని గుర్తు చేశారు. రాష్ట్రం ఆవిర్భావ రోజుల్లో 1లక్ష 6వేలుగా ఉన్న తలసరి ఆదాయం మూడు లక్షల 17 వేలకు చేరిందని చెప్పారు. పా ర్లమెంట్ వేదికగా ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి స్వ యంగా దేశంలోనే అభివృద్ధిలో ఎదుగుతూ సంక్షేమాన్ని అందిస్తూ తలసరి ఆదాయం పెరిగిన రా ష్ట్రం తెలంగాణ అని చెప్పారని గుర్తు చేశారు. విద్యుత్ వినియోగంలోనూ మనమే మొ దటి స్థానంలో ఉన్నామన్నారు. కలికోట సూర మ్మ ప్రాజెక్టును ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధం గా ఉన్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిమితి విషయంలో ఇబ్బంది గురి చేస్తు న్నా, ఇతర రుణాలు, ఆర్థికంగా నిధులను కేటాయిస్తూ పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
త్వరలోనే రైల్వే పనులు ప్రారంభం
రైల్వే పనులు ఇప్పటికే వేగవంతంగా నడుస్తున్నాయని, సిద్దిపేట వరకు రైల్వే పనులు పూర్తయ్యాయని చెప్పారు. సిద్దిపేట నుంచి సిరిసిల్ల వర కు చేయాల్సిన పనులపై టెండర్లు కూడా పిలిచామన్నారు. మానేరు జలాశయంపై రైల్వే వంతెన కూడా నిర్మిస్తామన్నారు. వేములవాడలో రైల్వే పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, రాజ న్న ఆలయ అభివృద్ధి పనులు కూడా వేగవంతం చేస్తామని చెప్పారు.
ప్రతిపక్షాలవి పచ్చి అబద్ధాలు
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు వచ్చి అబద్ధాలను మాట్లాడు తూ ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని వినోద్ కుమార్ విమర్శించారు. కరీంనగర్ ఎంపీ గా గెలిచిన బండి సంజయ్, కరీంనగర్ పార్లమెంటుకు ఈ రాష్ట్రానికి ఒక రూపాయి కూడా అదనం గా నిధులు తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. నలుగురు ఎంపీలుగా ఉన్న నాలుగు రూపాయలు కూడా తీసుకురాలేదని దుయ్యబట్టారు. 3 లక్షల జనాభా ఉన్న కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా ఎంపిక చేయడమే కాకుండా వెయ్యి కోట్ల రూపాయలు ని ధులు తెచ్చి పనులు చేయించామన్నారు. 2016 లో ప్రసాద్ సీం కింద వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం ఆలయాలను కలుపుతూ ప్ర తిపాదనలు పెట్టానని, కనీసం వాటిని కూడా ముందుకు తీసుకెళ్లలేదని మండిపడ్డారు. కనీసం రైల్వే పనులను కూడా ముందుకు తీసుకెళ్లక పోగా జిల్లాకు నవోదయ పాఠశాలలు కూడా తీసుకురావడంలో బండి విఫలమయ్యారని ధ్వజమెత్తారు.
అవినీతికి కేరాఫ్‌గా బీజేపీ రాష్ట్రాలు..
అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలన అం టూ విమర్శిస్తున్న బీజేపీ నాయకులను వినోద్ కుమార్ ఏకరువు పెట్టారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అత్యధికంగా అవినీతి ఉందని, ఇ ప్పటికే అనేక కథనాలు, విమర్శలు వచ్చిన విష యం నిజం కాదా? అని ప్రశ్నించారు. కర్ణాటకకు 40% కర్ణాటక ఎలా పేరువచ్చిందో బీజేపీ నాయకులకు తెలుసునని గుర్తు చేశారు. ప్రధానికి కు టుంబ పాలన మీద మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. కేంద్రంలోని అనేకమంది ఎంపీలు కుటుంబ పాలన నుంచే వచ్చి మీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేస్తున్నారని చెప్పారు. అయినా అందులో తప్పేమీ లేదని, ఉద్యమ కాలం నుంచే కేటీఆర్, హరీశ్, కవిలు ఉన్నారని, వారిని కుటుం బ సభ్యులుగా బూచిగా చూపడం సరికాదన్నారు. ప్రధానికి మాత్రం అదానీ, అంబానీ పెద్ద కుటుంబమని పరోక్షంగా విమర్శించారు.
రూ.4500 కోట్లతో పనులు : ఎమ్మెల్యే రమేశ్‌బాబు
ఎమ్మెల్యే రమేశ్‌బాబు మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గంలో రూ.4500 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. రాష్ట్రంలోనే లక్ష ఎకరాలకు సాగు నీరు అందించే ఏకైక నియోజకవర్గంగా వేములవాడ ముందుందన్నారు. రూ.670 కోట్ల రైతు బంధు, రూ. 600 కోట్లతో రహదారులు, రూ. 852 కోట్ల పింఛన్లు అందజేశామని, రూ.70 కోట్లకు పైగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెకులు అందజేశామని గుర్తు చేశారు. నియోజకవర్గంలో 1100 మంది దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేసి రూ.110 కోట్ల విలువైన యూనిట్లు అందజేస్తామని చెప్పారు. ఆత్మీ య సమ్మేళనాలకు కార్యకర్తలు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, జడ్పీటీసీలు మ్యాకల రవి, గట్ల మీన య్య, నాయకులు రాఘవరెడ్డి పుల్కం రాజు, రా మతీర్థపు రాజు, ఏశ తిరుపతి, ఊరడి ప్రవీణ్ తదితరులు ఉన్నారు.