Bodrai Festival | వీణవంక, జూన్ 03: వీణవంక మండలంలోని బొంతుపల్లి గ్రామంలో మంగళవారం శ్రీ భులక్ష్మి, మహాలక్ష్మి బొడ్రాయి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉదయం హోమాలు, సాయంత్రం ఉత్సవ విగ్రహాల జలాది వాసము నిర్వహించారు.
ఈ సందర్భంగా హోమాలు నిర్వహించగా గ్రామస్తులు సకుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఉపసర్పంచ్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.