BC reservations | చిగురుమామిడి, అక్టోబర్ 11: బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి లేదని, బీసీ బిల్లుకు పూర్తి వ్యతిరేకమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తాళ్లపల్లి తిరుపతి అన్నారు. మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ సానుకూలంగా ఉన్నట్లయితే హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు ఎందుకు వేయలేదన్నారు.
గతంలో 34 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్ 42 శాతం ఆమోదం పొందితే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరొస్తుందనే రాజకీయ దురుద్యేశముతో బీజేపీ ఉందన్నారు. దేశవ్యాప్తంగా బలహీనవర్గాలు తమపై జరుగుతున్న కుట్రలు, వివక్షను గ్రహించి రాబోయే భవిష్యత్తులో తగిన బుద్ది చెబుతాయన్నారు. బీసీ రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు సామాజిక ఉద్యమానికి సిద్ధం కావాలనన్నారు.
ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్, మండల యూత్ అధ్యక్షుడు గుడిసె మల్లికార్జున్, సోషల్ మీడియా మండల కన్వీనర్ గుజ్జుల రాజు, యూత్ మండల ప్రధాన కార్యదర్శి గంగుల లింగం, మండల నాయకులు బండారుపల్లి రాజు, సంద బోయిన పరశురాములు తదితరులు పాల్గొన్నారు.