Smart Ration Cards | గంభీరావుపేట, సెప్టెంబర్ 18 : గంభీరావుపేట మండల కేంద్రంలోని శుక్రవారం నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో బీజేపీ-కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రేషన్ బియ్యాన్ని మొత్తం ఖర్చు భరిస్తూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నదని, ఫ్లెక్సీ లో మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని ఇందులో రాష్ట్రం పెత్తనం ఎందని, బీజేపీ నేతలు అక్కడికి చేరుకొని అధికారులను విమర్శించారు.
భారత దేశంలోని మిగతా రాష్ట్రాలలో ప్రధాని మోడీ సన్న బియ్యం ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతలు ప్రతి సవాలు విసిరారు. కాగా ఇరు పార్టీ నేతలు సభ వేదిక పైన గొడవకు దిగారు. లబ్ధిదారుల ఎదుట ఒకరినొకరు తిట్టుకుంటూ తోచుకున్నారు. దీంతో బీజేపీ నేతలు అక్కడి నుండి వెను తిరిగి వెళ్లి పోయారు. చివరకు తహసీల్దార్ జోక్యం చేసుకోవడం తో రేషన్ కార్డుల పంపిణీ చేపట్టారు.