ఉప్పొంగిన అభిమానం
కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ హోదా తెచ్చి నగరాభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అని, రాష్ట్ర, జిల్లా అభివృద్ధిలోనూ ఆయన ముఖ్య భూమిక పోషించారని బీఆర్ఎస్ నాయకులు కొనియాడారు. సోమవారం మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా పండుగలా నిర్వహించారు.
- జిల్లా వ్యాప్తంగా పండుగలా మాజీ ఎంపీ వినోద్‌కుమార్ జన్మదిన వేడుకలు
- కేకులు కోసి సంబురాలు జరుపుకొన్న బీఆర్ఎస్ శ్రేణులు
- ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సేవా కార్యమ్రాలు
కార్పొరేషన్/ తెలంగాణచౌక్/మానకొండూర్/ కొత్తపల్లి/ శంకరపట్నం, తిమ్మాపూర్/ గంగాధర/ రామడుగు/ గన్నేరువరం/ చొప్పదండి, జూలై 22: కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ హోదా తెచ్చి నగరాభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అని, రాష్ట్ర, జిల్లా అభివృద్ధిలోనూ ఆయన ముఖ్య భూమిక పోషించారని బీఆర్ఎస్ నాయకులు కొనియాడారు. సోమవారం మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా పండుగలా నిర్వహించారు.
నగరంలోని తెలంగాణ చౌక్‌లో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు హాజరై భారీ కేక్‌ను కట్ చేశారు. స్వీట్లు, మొక్కలు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్‌కుమార్ తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో చెరగని ముద్ర వేశారన్నారు. రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు చేపట్టి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ రవీందర్‌సింగ్, కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, గందె మాధవి, నాయకుడు రాజు పాల్గొన్నారు.
నగర మేయర్ క్యాంపు కార్యాలయంలో యాదగిరి సునీల్‌రావు కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. బీఆర్ఎస్ నాయకులు అనిల్, నాగరాజు, నరేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో స్థానిక వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. నాయకులు రాజు, శ్రావణ్, ఆరె రవి గౌడ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకుడు జకుల నాగరాజు ఆధ్వర్యంలో స్థానిక చెన్నాడి హాస్పిటల్లో 30 మంది యువకులు తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానం చేశారు. దీనికి హాజరైన వినోద్‌కుమార్ కుమారుడు డాక్టర్ ప్రతీక్ మాట్లాడుతూ, గతంలో వినోద్‌కుమార్ ఎంపీగా ఉన్న సమయంలో తల సేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల కోసం ప్రతిమలో ప్రత్యేకంగా వార్డ్ ఏర్పాటు చేశారన్నారు. మంచిర్యాల చౌరస్తాలోని హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ప్రతిమ స్టడీ సరిల్లో కేక్ కట్ చేసి, విద్యార్థులకు కుర్చీలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వాల రమణారావు, గ్రంథాలయ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ప్రతిమ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ బోయినపల్లి ప్రతీక్, బీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మైకేల్ శ్రీను, మాజీ ఎంపీపీ రజిని, రేణుక, కర్రె పావని, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ నందేల్లి ప్రకాశ్ ఆధ్వర్యంలో రేకుర్తిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో హస్తపురం నర్సయ్య, రాచకొండ నరేశ్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకుడు సయ్యద్ నయీం ఆధ్వర్యంలో స్థానిక కరీముల్లా షా దర్గాలో పూలు, చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నాయకులు మీర్ శౌకత్ అలీ, ఎండీ ఇమ్రాన్, ఎండీ హారున్, దాసు వసంతరావు, శ్రీనివాస్, తగ్దీర్, వహీద్ పాల్గొన్నారు.
కులసంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్, జీఎస్ ఆనంద్, వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అసోసియేషన్ నాయకులు శ్రీనివాస్, సత్యనారాయణ, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. మానకొండూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్ కేక్ కట్‌చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. బీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు ఆడప శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఎరుకల శ్రీనివాస్‌గౌడ్, నాయకులు పిట్టల మధు, పడాల సతీశ్‌గౌడ్, శాతరాజు యాదగిరి, రెడ్డి సంపత్‌రెడ్డి, పిండి సందీప్, బొల్లం అనిల్ పాల్గొన్నారు. కొత్తపల్లి మండలం చింతకుంటలో భారీ కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కాసారపు శ్రీనివాస్‌గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ భూక్యా తిరుపతి నాయక్, మాజీ మారెట్ కమిటీ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రేణిగుంట రాజు, నాయకులు, ప్రజాప్రతినిధులు సంబోజు లత, శ్రీకాంత్ నాయక్, గజ్జల సాగర్, చిట్టిపెళ్లి నరేందర్, మహేశ్ గౌడ్, సద్దాం, సాజిత్, అన్వర్, మల్లేశం పాల్గొన్నారు. శంకరపట్నం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. మెట్పల్లి సింగిల్ విండో చైర్మన్ పొద్దుటూరి సంజీవరెడ్డి, మాజీ సర్పంచులు పల్లె సంజీవరెడ్డి, దాసారపు భద్రయ్య, మాజీ ఎంపీటీసీలు గాండ్ల తిరుపతయ్య, వావిలాల రాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోరె శ్రీనివాస్, గుర్రం శ్రీకాంత్, హనుమంతు, బొజ్జ రవి, బోడ సుధాకర్, సుభాష్‌రెడ్డి, గొడిశాల తిరుపతి, బూర్ల మొగిలి పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యాలయంలో వినోద్‌కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, నాయకులు ఉల్లెంగుల ఏకానందం, గుజ్జుల ప్రణీత్‌రెడ్డి, పొన్నం అనిల్‌గౌడ్, సంగుపట్ల మల్లేశం, వంగాల శ్రీనివాస్‌రెడ్డి, గడ్డి రమేశ్, బాలస్వామి పాల్గొన్నారు.
గంగాధర, మండలం మధురానగర్ చౌరస్తాలో కేక్‌కట్ చేశారు. అనంతరం ప్రముఖ పర్యాటక కేంద్రం బొమ్మలమ్మగుట్ట వద్ద మొక్కలు నాటారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, నాయకులు కంకణాల విజేందర్‌రెడ్డి, వేముల దమోదర్, దూలం శంకర్‌గౌడ్, ఆకుల శంకరయ్య, ముక్కెర మల్లేశం, వడ్లూరి ఆదిమల్లు, జోగు లక్ష్మీరాజం, దోమకొండ మల్లయ్య పాల్గొన్నారు. రామడుగు మండలం గోపాల్రావుపేట బస్టాండ్ కూడలిలో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్‌చేసి, స్వీట్లను పంపిణీ చేశారు. నాయకులు పూడూరి మల్లేశం, వేల్పుల హరికృష్ణ, ఎడవెల్లి పాపిరెడ్డి, రేండ్ల మల్లేశం, పురాణం రమేశ్, కల్లెం తిరుపతి, దాసరి భాస్కర్, పైండ్ల మధు, పైండ్ల తిరుపతి, ఇందుర్తి మల్లయ్య, దాసరి రాజు తదితరులు పాల్గొన్నారు.
గన్నేరువరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. వృద్ధులు, ప్రజలకు పండ్లు పంచారు. నాయకులు న్యాత సుధాకర్, గుడేల్లి ఆంజనేయులు, చింతల రవి, మీసాల ప్రభాకర్, బోయిని కుమార్, గొల్లపల్లి రవి, బూర శ్రీనివాస్, ర్యాగటి వీరయ్య, బండి తిరుపతి, సాయికుమార్, శంకర్, భగవాన్ రెడ్డి, రాములు, సమ్మెట అనిల్, ఈదయ్య పాల్గొన్నారు. చొప్పదండి పట్టణంలోని 2వ వార్డు కౌన్సిలర్ మాడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. యువజన విభాగం నాయకులు బందరపు అజయ్ కుమార్ గౌడ్, దండే కృష్ణ, సిరిపురం మల్లేశం, సిరిపురం సత్యం, ఆనందం, వెంకటేశ్, శంకరయ్య, సేపెళ్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

