Loka Bapureddy | కథలాపూర్, జనవరి 1: కథలాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో రైతుల సంక్షేమానికి ఆయన చేసిన సేవలను పలువురు నాయకులు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు నాగం భూమయ్య, బద్దం మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల నాయకులు కొండ ఆంజనేయులు, పుర్కుటపు సంతోష్‌రెడ్డి, గుండారపు గంగాధర్, శేఖర్ రెడ్డి, ఎంజీ రెడ్డి, ముస్కు శ్రీనివాస్, తీట్ల శంకర్, ఎండీ రఫీ, సంజీవ్, జనార్ధన్ రెడ్డి, ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.