Godavarikhani | కోల్ సిటీ, మే 30: గోదావరిఖని సింగరేణి స్టేడియం ప్రక్కన 33వ డివిజన్ పరశురాంనగర్ బోర్డు వద్ద రోడ్డు ప్రక్కన అనుమానాస్పదంగా పార్కింగ్ చేసి ఉంచిన ఈ ద్విచక్ర వాహనం ఎవరిదో తెలియక స్థానికులు అందోళన చెందుతున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వచ్చి రాత్రి పూట అక్కడ పార్కింగ్ చేసి వెళ్లిపోయాడు. ఇప్పటివరకు తిరిగి రాలేదని స్థానికులు వాపోతున్నారు.
వారం రోజులుగా వాహనం అక్కడే ఉంటుంది. ఆ వాహనంకు ఏలాంటి నంబర్ ప్లేట్ కూడా లేదు. వెనుకాల మాత్రం పోలీస్ అని రేడియం స్టిక్కర్ ఉంది. ఆ బైక్ ఎవరిదో..? ఎవరు ఇక్కడ పార్కింగ్ చేసి వెళ్లారో..? అసలేం జరిగిందో తెలియక చుట్ట ప్రక్కల వారు గందరగోళానికి గురవుతున్నారు.