Bhubharati | కాల్వ శ్రీరాంపూర్ జూన్ 2 : నేటి నుండి ఈనెల18 తేదీ వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జగదీశ్వర్ రావు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జగదీశ్వర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి కార్యక్రమంలో భాగంగా గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని గ్రామాల్లో మంగళవారం నుండి ప్రారంభమై ఈ నెల 18 తేదీ వరకు కొనసాగుతాయని వారు తెలిపారు.
3 న కాల్వ శ్రీరాంపూర్, గంగారం, 4 న ఇప్పలపల్లి, ఆశన్నపల్లి ,5 న పెద్దరాతుపల్లి, పెగడపల్లి 6 న చిన్నరాతుపల్లి, పెగడపల్లి 9న మోట్లపల్లి, మడిపల్లి 10న కిష్టంపేట, మడి పెళ్లి కాలనీ, అంకంపల్లి 11 న మీర్జంపేట, మంగపేట 12న తారుపల్లి, కునారం 13న మల్యాల, వెన్నంపల్లి ఈ నెల 16న పందిళ్ళ ఆరెపల్లి, వెన్నంపల్లి 17న ఎదులపూర్, జాఫర్ ఖాన్ పేట ఈ నెల 18న పెద్దంపేట ,లక్ష్మీపూర్ గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులందరూ రెవెన్యూ గ్రామసభల్లో పాల్గొనాలని ఏదైనా భూ సమస్యలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు