Collector Koyasriharsha | పెద్దపల్లి రూరల్, జూన్ 06 : చాలా కాలంగా రైతులకు, ప్రజలకు వారు అనుభవిస్తున్న భూములపై సరైన హక్కులు లేకుండా ఉన్నారని, అలాంటి వారందరూ భూ భారతి కార్యక్రమంలో సమస్యలు పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి మండలంలోని మూలసాల, చీకురాయి, సబ్బితం(గట్టు సింగారం)లలో శుక్రవారం భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు.
మూలసాలలో జరుగుతున్న సదస్సును కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా పలు అంశాలకు సంబంధించిన విషయాలను తహసీల్దార్ దండిగ రాజయ్య యాదవ్ తో పాటు, సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయిబ్ తహసీల్దార్ లు విజేందర్, రవీందర్ , ఆర్ఐలు భానుకుమార్, వెంకటరాజిరెడ్డి లతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.