Bhagya Reddy | సుల్తానాబాద్ రూరల్, మే 22: భాగ్యరెడ్డి వర్మ సేవలు స్ఫూర్తిదాయకమని మున్సిపల్ కమిషనర్ మహ్మద్ నియాజ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యరెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం కమిషనర్ మహమ్మద్ నియాజ్ మాట్లాడుతూ దళిత వైతాళికుడు సంఘ సంస్కర్త అని కొనియాడారు. సామజిక వివక్ష పై అలుపెరుగని పోరాటం చేసిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ అని కొనియాడారు. జీవితం ప్రజలందరికీ స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్లతో పాటు మున్సిపల్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.