తంగళ్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న ఆధ్వర్యంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ సిరిసిల్ల సింగిల్‌విండో చైర్మన్ బండి దేవదాస్‌గౌడ్, నేతలు పడిగెల రాజు, అవధూ త మహేందర్, మాట్ల మధు, సిలువేరి చిరంజీవి, బండి జగన్, కందుకూరి రామాగౌడ్, గుండు ప్రేమ్‌కుమార్, డాక్టర్ నక్క రవి, వెంగల రమేశ్, కేపీ రామ్, కిష్టారెడ్డి, భానుమూర్తి, పర్కపల్లి తిరుపతి, అఫ్రోజ్, అమర్‌రావు, రంగు ప్రసాద్, తదితరులు ఉన్నారు.
గంభీరావుపేటలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకట స్వామిగౌడ్ ఆధ్వర్యంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ దిష్టిబొమ్మను నాయకులు దహనం చేశారు. ఇక్కడ సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణరావు, నాయకులు కొమిరిశె ట్టి లక్ష్మణ్, వంగ సురేందర్‌రెడ్డి, లింగన్నగారి దయాకర్‌రావు, కమ్మరి రాజారాం, గంద్యాడపు రాజు, పెద్దవేని వెంకటియాదవ్, ఏనుగు కేశవరావు, రామాంజగౌడ్, గడ్డి హరీశ్, వహీ ద్, చెవుల మల్లేశం, గోగు లింగంయాదవ్, ఎగదండి స్వామి, శ్రీనివాస్, దోసల రాజు, భూషణం, నర్సింగరా వు, సుధాకర్‌రావు, మీను ఉన్నారు.
కోనరావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య ఆధ్వర్యంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీకి ద్రో హం చేసిన సంజయ్‌కి దమ్ముంటే.. రాజీనా మా చేసి గెలువాలన్నారు. ఇక్కడ ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, మండల విద్యార్థి విభా గం అధ్యక్షుడు శివతేజరావు, నాయకులు రత్నాకర్‌రెడ్డి, వంగపల్లి శ్రీనివాస్, దొంతరవేని శ్రీనివాస్, తిరుపతిగౌడ్ ఉన్నారు.
వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొస్కుల రవి ఆధ్వర్యంలో సోమవారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ దిష్టిబొమ్మ ను దహనం చేశారు. రెండుసార్లు టికెట్ ఇచ్చి గెలిపించిన బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్‌లో చేరడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ మాజీ సర్పంచ్ సుమన్, తిరుపతి, పిట్టల వెంకటేశ్, లక్ష్మణ్, అంజి, శ్రీనివాస్, మహేశ్, అంజిరెడ్డి, అంజయ్య, శ్రీనివాస్, సంతోష్, రవి, మహేశ్, రవి, మధు ఉన్నారు.
వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో జగిత్యాల సంజయ్ దిష్టిబొమ్మ బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టమని చెప్పిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఏ రాళ్లతో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను కొట్టాలో సూచించాలని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన సం జయ్ కాంగ్రెస్‌లో చేరడాన్ని ఎకడికకడ ప్రజలు నిలదీస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా పార్టీ మారేందుకే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని ఆ రోపించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి రామ్‌చందర్, నాయకులు వెంగల శ్రీకాంత్‌గౌడ్, అంజత్‌పాషా, పైడి శ్రీనివాస్, వాసాల శ్రీనివాస్, సందీప్, రాకేశ్, పర్వేజ్, ఉమర్, సంతోష్ ఉన్నారు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. తల్లిలాంటి బీఆర్ఎస్ పార్టీని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వదిలి కాంగ్రెస్‌లో చేరడం నమ్మక ద్రోహమని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి మండిపడ్డారు. ఇక్కడ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు ల్యాగల శ్రీనివాస్‌రెడ్డి, సింగారపు మధు, నాయకులు కొండ రమేశ్‌గౌడ్, పాశం దేవరెడ్డి, మజీద్, పందిళ్ల పరశురాములు, కొడిమోజు దేవేందర్, ఇల్లెందుల శ్రీనివాస్‌రెడ్డి, ఎండపల్లి క్రాం తి, నరేందర్, కిషన్, జీడి శ్రీనివాస్ ఉన్నారు.
చందుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ దిష్టిబొమ్మ దహనం చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే.. సంజయ్‌కుమార్ నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. ఇకడ పార్టీ మండలాధ్యక్షుడు ఎల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, సెస్ మాజీ డైరెక్టర్ దప్పుల అశోక్, మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, కో ఆప్షన్ సభ్యుడు బత్తుల కమలాకర్, నాయకు లు మరాటి మల్లిక్, దమ్మ ఆనంద్, మాదాసు ప్రసాద్, ఎండీ ఇస్మాయిల్, కొమ్ము రమేశ్, దారం బాల్‌రెడ్డి, గబ్బర్‌సింగ్, ఉగిలే సత్త య్య, రవి, వెంకటేశం ఉన్నారు.
రుద్రంగి మండల కేంద్రంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్ ఆధ్వర్యంలో సోమవారం నాయకులు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ చిత్రపటా న్ని దహనం చేశారు. ఇక్కడ సెస్ డైరెక్టర్ ఆకు ల గంగారాం, నాయకులు మంచె రాజేశం, కంటె రెడ్డి, చెప్యాల గణేశ్, కాదాసు లక్ష్మణ్, గొళ్లెం నర్సింగ్, గెంటె ప్రశాంత్, ఆకుల గంగాధర్, నరేశ్, కొండయ్య, తదితరులు ఉన్నారు.
ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఎత్తండి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇక్కడ నేతలు గూడూరు భరత్, చెవుల మల్లేశం, కొమ్ము బాలయ్య, నవాజ్, మెంగని మనోహర్, శీలం స్వామి, నవీన్ ఉన్నారు.
జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు దహనం చేసి నిరసన తెలిపారు. పార్టీ మారుతున్న నాయకులు దమ్ముంటే.. పదవులకు రాజీనామా చేయలని డిమాండ్ చేశారు.