Bhagavad Gita | కమాన్ చౌరస్తా, డిసెంబర్ 28 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్లో ఆదివారం , లలిత సహస్ర గళ స్త్రోత్ర పారాయణం భగవద్గీత నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి గీత భక్త సమాజం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మలయాళ సద్గురు మఠం, గీతా మందరం విష్ణు సేవానంద గిరి స్వామి, సంపూర్ణ నంద గిరి స్వామి, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమ శాస్త్ర పండితులు నమిలకొండ రమణాచార్యస్వామి, పరబ్రహ్మానందగిరి స్వామి, సత్యానంద స్వామి, సనక సనానంద స్వామి, చిదానంద గిరి స్వామి, భక్త రాజేశం, చల్లూరు విష్ణుమూర్తి, చల్లూరు రంజిత్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఇక్కడ అధ్యక్షుడు బండ సత్తయ్య గీత భక్త సమాజం నిర్వహణ కమిటీ సభ్యులు వెంకటేశం, ఆంజనేయులు, రాధ కిషన్, దామోదర్, సుదర్శనం దశరథం, అల్లే చిన్నవెంకటయ్య, సత్య నారాయణ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనంతరం అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.