విద్యానగర్, ఫిబ్రవరి 16: ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలందించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ సూచించారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ బోర్డు సమీపంలో 150పడకల సన్‌రైజ్ దవాఖానను ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కరీంనగర్, చొప్పదండి, సిర్పూర్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, మేడిపల్లి సత్యం, డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు దవాఖాన నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో నిర్వాహకులు, వైద్యులు జే సురేశ్, ఎన్ ప్రవీణ్‌సింగ్, కొండపాక కిరణ్, వెంకట్‌రెడ్డి, దామోదర్, కృష్ణచైతన్య, వంశీధర్, రాము, శ్రావణ్, భూవనేశ్వర్రావు, చీటి కార్తీక్, సిబ్బంది పాల్గొన్నారు.