కమాన్‌చౌరస్తా, జూన్ 10 : ఐఐటీ -జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ట్రినిటీ విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తుమ ఫలితాలు సాధించినట్లు చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో విద్యార్థులను సోమవారం ఆయన అభినందించి మాట్లాడారు.
కళాశాలకు చెందిన జే హనీకర్ ఆలిండియా స్థాయిలో 19వ ర్యాంకు సాధించాడని చెప్పారు. అలాగే, రఘుపతి 124, పీ అజయ్ 195, బీ రంజిత్ కుమార్ 1005, నిస్సీ జాస్పర్ 1213, ఆశిశ్ 1261, జతిన్ 1645, పీ ప్రజ్వల్ 2281వ ర్యాంకు సాధించారని వివరించారు. విద్యార్థుల పట్టుదలతో పాటు తల్లిదండ్రుల సహకారం, అధ్యాపకుల నిరంతర కృషి ద్వారా అత్యుత్తమ ర్యాంకులు సాధ్యమైనట్లు చెప్పారు.