సైదాపూర్, అక్టోబర్ 28 : సైదాపూర్ మండల కేంద్రంలో ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. కొద్దిరోజుల కింద అర్ధరాత్రి వేళలో సమ్మక్క గుట్ట సమీపంలోని ప్రధాన రహదారిపై వెళ్లిన దృశ్యాలు స్థానిక పెట్రోల్ బంక్ సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి.
మండల కేంద్రానికి సమీపంలో ఉండే రెండు గుట్టల్లో ఎలుగుబంట్లు ఆవాసం ఉండేవి. కానీ, ఇటీవల అక్కడ క్వారీలు ఏర్పాటు చేయడంతో అవి అక్కడి నుంచి వస్తున్నాయి. మండల కేంద్రాన్ని ఆనుకుని ఉన్న సమ్మక్కగుట్ట వద్ద తిరుగుతున్నాయి. తాగునీటి కోసం రాత్రివేళలో గుట్ట దిగి గ్రామాల్లోకి వస్తుండడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.