BCM Trust | బోయినపల్లి, డిసెంబర్ 7 : గ్రామీణ పేద ప్రజలకు కుదురుపాక బిసిఎం ట్రస్ట్ వరం లాంటిదని రామన్నపేట సర్పంచ్ చింతలపల్లి కవిత వెంకటరెడ్డి చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక బీసీఎం ట్రస్ట్ కంటి దవఖాన ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సర్పంచ్ చింతలపల్లి కవిత వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ ఉచిత కంటి పెద్ద శిబిరంలో 150 మందికి ఉచిత పరీక్షలు చేసి, మరో కొందరికి కంటి ఆపరేషన్ ఎందుకు ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సర్పంచ్ చింతలపల్లి కవిత వెంకటరెడ్డి మాట్లాడుతూ కొదురుపాక బి సి ఎం కంటి ఆస్పత్రి నిర్వాహకులు ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వైరాగ్యం రాజలింగం-రీటా బహుదుర్ షా దంపతులు ఈ మారుమూల ప్రాంతంలో అధునాతన సౌకర్యాలతో కార్పొరేటు కు మించి కంటి దవాఖాన ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు.
ఇప్పటివరకు ఈ మూడేళ్ల కాలంలో 56 గ్రామాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి పదివేల మందికి పైగా కంటి పరీక్షలు చేశారని చెప్పారు. అంతేకాకుండా 2150 మందికి సెకండ్ టి ఆపరేషన్ చేశారని చెప్పారు. గ్రామీణ పేద ప్రజలకు ఈ కంటి దవాఖాన చాలా ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ వైరాగ్యం రిట బహదూర్ షా, డ్యూటీ డాక్టర్ రాజేంద్రనాథ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు చింతలపల్లి వెంకటరెడ్డి, కలంపల్లి రాములు, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.