స్వరాష్ట్రంలో ఊరూరా ప్రగతి
స్వరాష్ట్రంలోనే ఊరూరా ప్రగతి కాంతులు వెదజల్లుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. సీఎం కేసీఆర్ హాయాంలోనే పట్టణాలు, పల్లెల రూపురేఖలు మారాయని చెప్పారు.
సీఎం కేసీఆర్ పాలనలో పల్లెల రూపురేఖలు మారుతున్నయ్. ఊరూరా ప్రగతి కాంతులు వెదజల్లుతున్నయ్. కరీంనగర్ నుంచి సమీపంలోని పల్లెలు, పట్టణాలకు వెళ్లేదారిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తం. పద్మనగర్ నుంచి ఒద్యారం వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసినం. కొత్తగా కొత్తపల్లి సహజ కాలేజీ నుంచి వెలిచాల ఎక్స్ రోడ్డు వరకు సెంట్రల్‌లైటింగ్ పనులు చేపడుతం. ఆగస్టు 15లోగా పూర్తి చేస్తం.
కొత్తపల్లి/ కరీంనగర్ రూరల్, మే 13 : స్వరాష్ట్రంలోనే ఊరూరా ప్రగతి కాంతులు వెదజల్లుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. సీఎం కేసీఆర్ హాయాంలోనే పట్టణాలు, పల్లెల రూపురేఖలు మారాయని చెప్పారు. శనివారం ఆయన కొత్తపల్లి మున్సిపల్ పరిధిలోని వెలిచాల ఎక్స్‌రోడ్డు వద్ద 4.40 కోట్లతో చేపట్టనున్న రోడ్డాం నిర్మాణపనులకు శంకుస్థాపన చేశారు. కరీంనగర్ రూ రల్ మండలం వెదురుగట్ట- చామనపల్లి బ్రిడ్జి పనులను ప్రారంభించారు. ఇటీవల పూర్తయిన ఇరుకుల్ల-చామనపల్లి రోడ్డు పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ, కరీంనగర్ నుంచి సమీపంలోని పల్లెలు, పట్టణాలకు వెళ్లేదారిలో సెంట్రల్‌లైటింగ్ ఏర్పా టు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే రేకుర్తి నుంచి శాతవాహన యూనివర్సిటీ మీదుగా పద్మనగర్ నుంచి ఒద్యారం వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. కొత్తపల్లి సహజ కాలేజీ నుంచి వెలిచాల ఎక్స్ రోడ్డు వర కు 5.50 లక్షలతో సెంట్రల్‌లైటింగ్ పనులు చేపట్టి ఆగస్టు15లోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గత పాలకుల హయాంలో దరఖాస్తు లు ఇచ్చి దండం పెట్టినా పనులు కాలేదని, కా నీ కేసీఆర్ సర్కారు అడుగకున్నా అన్ని పనులు చేస్తున్నదని చెప్పారు. పనిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు. ఈ సర్కారు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఊర్లలోని చెరువులు, కుంటలు ఎం డకాలంలోనూ మత్తళ్లు దూకుతున్నాయని చెప్పారు.
రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటామన్నారు. అధైర్యపడవద్దని సూచించా రు. కాగా, బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేసిన మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పలువురు గంగులను ఘనంగా సన్మానించారు. రామడుగు పీఏసీఎస్ చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్రావు, వెలిచాల సర్పంచ్ వీర్ల సరోజన, కౌన్సిలర్లు వాసాల రమేశ్, జెర్రిపోతుల మొండయ్య, మానుపాటి వేణుగోపాల్, గు న్నాల విజయా రమేశ్, గండు రాంబాబు, చిం తల సత్యనారాయణరెడ్డి, స్వర్గం నర్సయ్య, కో ఆప్షన్ మెంబర్ ఫక్రుద్దీన్, శెట్టిపల్లి ప్రభాకర్, ఎస్కే మునావర్‌ఖాన్, జడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు జమీలొద్దీన్, బీఆర్ఎస్ నాయకులు వేముల శేఖర్, ఎస్కే బాబా, కట్ల సుధాకర్, బండ గోపాల్‌రెడ్డి, జెర్రిపోతుల శ్రీకాంత్, రవీందర్రావు, సంజీవరావు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

