కరీంనగర్ తెలంగాణ చౌక్, జనవరి 3 : పెండింగ్లో ఉన్న బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో శక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్లోకి చొచ్చుకొని పోయేందుకు ప్రయత్నంచడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ, బీసీ విద్యార్థులకు పెండింగ్ ఫీజు రీయింబర్మెంట్స్ 5 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు.
ఎన్నికలకు ముందు విద్యార్థుల సమ్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ఎదుట ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇండ్ల ఎదుట ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ పమేలా సత్పతికి వినతి పత్రం అందజేశారు. ధర్నాలో నాయకులు నితిన్, శ్రీనివాస్, బాలకృష్ణ, గంగాభవాని పాల్గొన్నారు.