Pegadapalle | పెగడపల్లి: జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ పెగడపల్లి మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద మండల బీసీ సంఘం జేఏసీ నాయకులు చేస్తున్న రిలే నిరాహా దీక్షలు సోమవారంతో మూడో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా బీసీ సంఘం మండలాధ్యక్షుడు నీరటి రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే వరకు తమ పోరాటం ఆగదని, దీని కోసం ఢిల్లీ వరకు వెళ్లేందుకు బీసీలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చింతకింది అనసూర్య, బీసీ జేఏసీ మండల నాయకులు ఉప్పు రవీందర్, చిందం తిరుపతి, గంగుల కొమురెల్లి, కిషోర్, చీరయ్య, రమేశ్, వీరేశం, రాజేశం, భూమయ్య, రాకేష్, పోచయ్య, జలపతి తదితరులు పాల్గొన్నారు.