ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం వేళ కూడళ్లలో ఉంచి ఆటపాటలతో సందడి చేశారు. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..అంటూ ఆటపాటల్లో మునిగితేలారు. చీకటి పడ్డ తర్వాత బతుకమ్మ తెప్పలు, సమీపంలోని వాగులు, ఒర్రెల్లో నిమజ్జనం చేశారు. వేములవాడ రాజన్న ఆలయ ఆవరణలో మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మ ఆడారు.
Karimnagar