కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 30 : మహాత్మా బసవేశ్వర 892వ జయంతి వేడుకలు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. శ్రీ బసవేశ్వర చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డి.ఆర్.ఓ వెంకటేశ్వర్లు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. మూఢనమ్మకాలు బలంగా ఉన్న పూర్వపు రోజుల్లో తన బోధనల ద్వారా ప్రజలను మూఢాచారాల నుండి కాపాడారని అన్నారు. సమాజంలో కుల, వర్ణ లింగ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. సమానత్వాన్ని బోధించిన అభ్యుదయవాది మహాత్మ శ్రీ బసవేశ్వర జయంతిని ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించడం హర్షనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో లింగాయతుల సంఘం నాయకులు, వీరశైవ మహాసభ నేతలు, అధికారులు పాల్గొన్నారు.