Bandi Sanjay Kumar | కమాన్ చౌరస్తా, డిసెంబర్ 31 : ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు, నూతనంగా టీఈటీ రాసే అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం(జీటీఏ) అధ్యక్ష కార్యదర్శులు, కమిటీ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్కు వినతి ప్రతం అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సర్వీస్ ఉపాధ్యాయులు ఇప్పటికే బీఈడీ వంటి ఉపాధ్యాయ వృత్తి విద్యా కోర్సులను పూర్తి చేసి, కఠినమైన పోటీ పరీక్షలను ఎదుర్కొని ఉన్నవారికి మళ్లీ టెట్ తప్పనిసరి చేయడం వేలాది మంది ఉపాధ్యాయులకు మనోవేదనకు గురి చేస్తుందని, ఈ నిబంధనలను పున సమీక్షించాలని, ఉపాధ్యాయుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విషయాన్ని కేంద్ర విద్యా శాఖ దృష్టికి తీసుకువెళ్లి తగిన పరిష్కారం చూపాలని కోరారు.
అనంతరం, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ను బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గాజుల రవీందర్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు భగవంతయ్య, డీసీఈబీ సెక్రటరీ కార్యవర్గ సభ్యులు బొడిగే శ్రీనివాస్, ప్రమీల, జీహెచ్ఎం శంకర్ , ఆకారపు మమత, వెంకటయ్య, మాగంటి శ్రీనివాస్, ఎంఈవో పుప్పాల క్రిష్ణ గోపాల్, ఉపాధ్యాయులు సంగోజు సత్యనారాయణ చారి, ప్రసాద్ రావు, రామారావు, ప్రవీణ్ రావు, తిరుపతి రెడ్డి, పి రమేష్ రెడ్డి, లక్ష్మీపతి, మైసయ్య, తదితరులు పాల్గొన్నారు.