రాజన్న సిరిసిల్ల, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 15 నుంచి వస్త్ర పరిశ్రమ బంద్ పాటిస్తున్నట్లు పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు మండల సత్యం ప్రకటించారు. పాలిస్టర్ వస్త్ర ఉత్పిత్తిదారుల సంఘ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సిరిసిల్లలో తయారైన పాలిస్టర్ వస్ర్తాలకు మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడంతో నిల్వలు పేరుకు పోయాయన్నారు. దేశ వ్యాప్తంగా మాంద్యం నెలకొన్న కారణంగా నిరవధికంగా బంద్పెడుతున్నట్లు చెప్పారు. ఆసాములు, కార్మికులు అనుబంధ పరిశ్రమల సభ్యులు సహకరించాలని కోరారు. సమావేశంలో ఉపాధ్యాక్షుడు బూట్ల నవీన్‌కుమార్, కార్యదర్శి వెల్దండి దేవదాస్, సహాయ కార్యదర్శి పోరండ్ల మల్లేశం, శ్రీరాం సత్యం పాల్గొన్నారు.