కమాన్‌చౌరస్తా, జూన్ 6: క్లాసికల్, వెస్ట్రన్ డ్యాన్స్‌లు..ఫోక్ అండ్ రాక్ సాంగ్స్‌తో బాలభవన్ వేసవి క్యాంపు ముగింపు వేడుకలు ఉల్లాసంగా..ఉత్సాహంగా సాగాయి. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో 45 రోజుల పాటు సాగిన ట్రైనింగ్ క్యాంపు అట్టహాసంగా ముగిసింది. ఈ సంవంత్సరం వేసవి శిక్షణకు భారీ స్పందన రాగా, దాదాపు 760 మంది విద్యార్థులు శిక్షణలో పాల్గొన్నారు.
శ్రీధర్, రాధాకృష్ణ, కృష్ణకుమార్, సూర్యశ్రీ, అనూప్, రాధిక, మళ్లిక, సుహాసిని శిక్షణ ఇచ్చారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకలను బాలభవన్ నిర్వాహకురాలు కే మంజులాదేవి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తాము నేర్చుకున్న డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్, సంగీతం, మృదంగం, డ్రాయింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యోగా, అబాకస్‌ను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఆటపాటలతో హోరెత్తించారు. చెస్ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.