Korutla | కోరుట్ల, జనవరి 28 : కోరుట్ల పట్టణానికి చెందిన న్యాయవాది బైరి విజయ్ కుమార్ బీఆర్ఎస్ లీగల్ సేల్ చీఫ్ కన్వీనర్ గా బుధవారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నియామక పత్రం అందజేశారు.
కో-కన్వీనర్లుగా సుతారి నవీన్ కుమార్, వనపర్తి క్రాంతికుమార్, వేముల నాగరాజు, కటుకం రాజేష్, ఊరడి నరేందర్, రాస గౌతమ్, అల్వాల వినయ్ కుమార్, సదుల మాధురి, ఓటారికారి రంజిత, గట్ల సృజన్ కుమార్ను నియమిస్తూ వారికి నియామక పత్రాలను కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అందించారు.
వీరి నియామకంపై బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, నాయకులు సింగిరెడ్డి నారాయణ రెడ్డి, గుడ్ల మనోహర్ హర్షం వ్యక్తం చేస్తూ లీగల్ సెల్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. న్యాయపరమైన కార్యకలాపాలను సమర్థవంతంగా బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని నూతనంగా నియమితులైన కన్వీనర్, కో కన్వీనర్లు తెలిపారు.