MLA Sanjay Kumar | కోరుట్ల, డిసెంబర్ 6: అయ్యప్పస్వామి పుట్టిన రోజు వేడుకలలో భాగంగా శనివారం పట్టణంలో అయ్యప్ప ఆరట్టు వేడుకలను అయ్యప్ప స్వాములు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప విగ్రహాలను ప్రత్యేక వాహనంలో ఏర్పాటు చేసి మేళతాళాల మధ్య ఘనంగా ఊరేగింపు నిర్వహించారు.
పట్టణంలోని మహాదేవ స్వామి దేవాలయం కోనేరులో వినాయకుడు, అయ్యప్ప, సుబ్రహ్మణ్యంస్వామి ఉత్సవ మూర్తులకు పంచామృతలతో అభిషేకం, చక్రస్నానం జరిపించారు ప్రత్యేక వాహనంలో అయ్యప్ప స్వామి వారిని ఊరేగింపు నిర్వహించారు. ఈ ఆరట్టు వేడుకల్లో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కోరుట్ల నియోజకవర్గ ప్రజలపై స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వేడుకున్నారు. వేడుకల్లో అయ్యప్ప జ్ఞాన సరస్వతీ మాత ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.