Awareness rally | కోరుట్ల, జూలై 28: పట్టణంలోని కోరుట్ల పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సోమవారం నాషా ముక్తు భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పొగాకు హానికారక ప్రభావాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పాఠశాల నుంచి కొత్త బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా తరలివచ్చి, తంబాకు తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరిస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు.
పొగాకు వాడకం వల్ల క్యాన్సర్ బారిన పడతారని, తంబాకు మహమ్మారిని తరిమి కొట్టాలని నో టుబాకో, నో సిగరెట్ అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వెంకటేష్, విద్యార్థులు పాల్గొన్నారు.