Awareness | కాల్వశ్రీరాంపూర్, జనవరి 12 : తెలంగాణ గ్రామీణ బ్యాంకు కాల్వ శ్రీరాంపూర్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో సోమవారం ఆర్థిక, సాంకేతిక అక్షరాస్యత సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ మహేష్ మాట్లాడుతూ నాబార్డ్ సౌజన్యంతో బ్యాంకు సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఈ సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన కళాజాతా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళాకారులు జానపద గీతాలు, మ్యాజిక్ షో ల ద్వారా బ్యాంకు ఖాతాల ప్రాముఖ్యత, పొదుపు పథకాలు, డిజిటల్ లావాదేవీల గురించి వివరించిన తీరు పలువురిని ఆకట్టుకుంది. పీఎంజేజేబీవై, పీఎంఎస్బీవై, అటల్ పెన్షన్ యోజన, ఎస్బీఐ జనరల్ పథకాలను వివరించారు. సైబల్ నేరాల పట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం లవకుమార్, సీసీలు, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.