Auction | చిగురుమామిడి, ఏప్రిల్ 25: మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం కొబ్బరికాయల వేలంపాటను ఆలయ ఇన్స్పెక్టర్ పాము సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయంలో కొబ్బరికాయల విక్రయం వేలంపాట నిర్వహించగా గ్రామానికి చెందిన గందె అనిల్ కుమార్ రూ.40వేలు పాడి కైవసం చేసుకున్నారు.
కాగా కొబ్బరి వక్కల టెండర్ ను ఓదెల మండలానికి చెందిన పరుశరాములు రూ.6 వేలకు దక్కించుకున్నాడు. ఈ వేలం పాటలో ఆలయ ఇన్స్పెక్టర్ తో పాటు క్లర్కు బూట్ల కవిత, ఆలయ అర్చకులు శేషం నవీనాచార్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.