Secured jobs | తిమ్మాపూర్ రూరల్,జూన్ 14 :మండలంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (అటానమస్) కళాశాలకు చెందిన 100 మందికి పై గా విద్యార్థులు ప్రభుత్వ, బహుళ జాతి సంస్థలలో ఉద్యోగాలు సాధించారని కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు తెలిపారు.
జ్యోతిష్మతి విద్యార్థులు సంవత్సరానికి రూ.52 లక్షలు,రూ.19 లక్షలు,రూ.16.85 లక్షలు,రూ.12.30 లక్షలు, రూ.9 లక్షలు,రూ.7 లక్షలు,రూ. 6 లక్షలు, రూ.4 లక్షలు,రూ. 3.50 లక్షల చొప్పున ఎన్విడియా, క్యాడన్స్, క్వాల్కమ్, టార్గెట్, ఇన్ఫోసిస్, క్యాప్ జెమినీ, కాగ్నిజెంట్, టిసిఎస్ వంటి 25 బహుళ జాతి సాంకేతిక సంస్థలలో ఉద్యోగాలను పొందారన్నారు. కరీంనగర్ లో కళాశాల స్థాపించి 28 సంవత్సరాలు కావస్తుందని న్యాక్,ఎన్ బిఏ,అటానమస్ స్టేటస్ పొందిన ప్రథమ కళాశాల జ్యోతిష్మతి అన్నారు.
విద్యార్థుల అభివృద్ధే కళాశాల లక్ష్యంగా నిష్ణాతులైన అధ్యాపక బృందంతో విద్యతో పాటు నేటి అవసరాలకు అనుగుణంగా కళాశాలలో స్యాప్- టాస్క్ సహకారంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కంప్యూటర్ ల్యాబ్ అందుబాటులోకి ఉందని, కోడ్ ఉన్నతి, టాస్క్ పర్యవేక్షణలో విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు వివిధ రకాలైన కార్యశాలలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళాశాల కరస్పాండెంట్ సుమిత్ సాయి ,ప్రిన్సిపల్ టి. అనిల్ కుమార్, డీన్ అకాడమిక్స్ పికే. వైశాలి, విభాగాధిపతులు, అధ్యాపక బృందం ఎంపికైన విద్యార్థులను అభినందించారు.