National level Hackathon | తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 7: మండలంలోని జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (అటానమస్) కళాశాల విద్యార్థులు అజిత్, అక్షిత్, రమేష్ హైదరాబాద్లో ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, కాహార్ట్ సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన జాతీయ స్థాయి హ్యాకథాన్లో 92 జట్లతో పోటీపడి ప్రథమ స్థానంలో నిలిచారు.
పంట వ్యాధులను గుర్తించడానికి స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి ప్రాజెక్ట్ అల్ క్రాప్ కేర్ అనే ఏ1-ఆధారిత పరిష్కారాన్ని రూపొందించారు. విద్యార్థులు తమ అత్యుత్తమ ప్రదర్శనకు గాను రూ.10 వేల నగదు, ప్రశంసా పత్రం అందుకున్నారు.
కళాశాలకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన విద్యార్థులను ఈ సందర్భంగా చైర్మన్ జువ్వాడి సాగర్ రావు అభినందించారు. వారి భవిష్యత్తుకు ఇది బంగారు బాటలు వేస్తుంది అని ఆయన అభిప్రాయపడ్డారు.