Godavari Khani | కోల్ సిటీ , ఏప్రిల్ 17: పారిశ్రామిక ప్రాంతంలోని చిరు వ్యాపారులకు భరోసా స్వచ్ఛంద సంస్థ బాసటగా నిలిచింది. నల్లి ప్రసాద్ కుమార్ జన్మదినం సందర్భంగా భరోసా సంస్థ నిర్వాహకులు నసీమా ఆధ్వర్యంలో గురువారం చిరు వ్యాపారం చేసుకుంటూ ఎండకు ఇబ్బంది పడుతున్న వారికి బాసటగా జంబో గొడుగులను అందజేసి ఉదారతను చాటుకున్నారు.
రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా చిరు వ్యాపారాలు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు గొడుగులు ఆసరగా ఉంటాయని అందజేసినట్లు తెలిపారు. అలాగే పారిశ్రామిక ప్రాంతంలో రోడ్ల పక్కన ఎండలో ఇబ్బందులను తట్టుకుంటూ జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారులకు త్వరలోనే వీటిని మరింతగా అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు బొల్లం మధుబాబు, పైడిపల్లి దీపక్ కుమార్, ఎండీ హకీమ్, కుంట సది తదితరులు పాల్గొన్నారు.