ASHA workers | చిగురుమామిడి, జులై 8 : దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సమ్మెలో భాగంగా మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఆశా వర్కర్లు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు బయలుదేరి ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ముద్దసాని రమేష్ కు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మారేళ్ల శ్రీలత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికులు ఎంతగానో పోరాడి తమ ప్రాణాలు అర్పించి తీసుకొచ్చిన 29 కార్మిక చట్టాలను రద్దుచేసి, కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్స్ ను తీసుకొచ్చిందన్నారు.
ఈ లేబర్ కోడ్స్ అమలుకై తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని, ఈ చర్యలు భారత రాజ్యాంగంలో ఆర్టికల్19(1) సి ఆర్టికల్21,24 39 (ఈ లేబర్ కోడ్స్ కార్మికులకు నష్టం కలిగించే విధంగా సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి, 10 గంటలకు పెంచిందని, ఉద్యోగ భద్రత, ప్రభుత్వ రంగ సంస్థప్రైవేటీకరణ పై ప్రభుత్వం మొగ్గు చూపుతోందన్నారు.
ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ, స్కీంవర్క్ లను కార్మికులుగా గుర్తించి కనీస స్థిర వేతనం రూ 26000 ఇవ్వాలని,ఆశాలకు భారతదేశ వ్యాప్తంగా ఒకే రకమైన పని విధానాన్ని అమలు చేయాలనీ, ఆశలకు ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించి, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు నాగలి పద్మ, మండల కార్యదర్శి బోయిన ప్రియాంక, పుష్ప, బెజ్జంకి సరోజన, సాహిదా బేగం, బండారి సరోజన, శ్వేత, కవిత, పూజ, సుగుణ, నాగరాణి, మంజుల, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.