కరీంనగర్ ముకరంపుర, ఏప్రిల్ 10 : తెలంగాణ విద్యుత్ అర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ సరిల్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న అర్టిజన్ కార్మికుల సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరింది. తమ డిమాండ్లను పరిషరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా కార్మికులు హెచ్చరించారు.
ఇక్కడ ఎన్పీడీసీఎల్ నాయకులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ గుగులోత్ శివకృష్ణ, వెలిశెట్టి రమేశ్, జిల్లా చైర్మన్ గన్ను నరేందర్రెడ్డి, అటికేటి రవీందర్, అనంతరెడ్డి, పురుమల్ల సంతోష్, కృష్ణ, హరీశ్, రమేశ్, విజయ్, శ్యాంసుందర్, గంగయ్య, అనిల్, శ్రీనివాస్, మనోహర్, మహిపాల్, తిరుపతి, కరుణాకర్, లింగంపల్లి కిషన్, వడ్నాల మల్లేశం, రాధిక, సాగరిక, రాజశేఖర్, జ్యోత్స్న, ఉమారాణి, జ్యోతి స్వప్న, పద్మ, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.