help of donors | సుల్తానాబాద్ రూరల్, సెప్టెంబర్ 24 : దాతల సహకారంతో శివుడి విగ్రహాన్ని ప్రతిష్టాపించి ఏర్పాట్లను వేగంగా చేస్తున్నారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలో నీ పెద్ద చెరువు వద్ద ఆగస్టు 30న శివుడి విగ్రహా ఏర్పాటు పనులను ప్రారంభించారు. సెప్టెంబర్ 5న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. శివుడి విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో పనులను చేపడుతున్నారు. స్వచ్ఛందంగా దాతలు ముందుకు వచ్చి నిర్మాణం పనులకు సహాయ సహకారాలను అందిస్తున్నారని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. శివుడి విగ్రహ ఏర్పాటుకు కమిటీ సభ్యులు రూ.16 లక్షల ఉంచనా ఉండగా రూ.20 లక్షల వరకు అవుతుందని వారు తెలిపారు. చెరువు నీళ్లు ఉండడం వల్ల నాణ్యమైన మెటీరియల్ వాడుతున్నామని వారు అన్నారు. చెరువు వద్ద శివుడి విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల పర్యాటక ప్రాంతంగా ఉంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 29న ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించినట్లు వారు అన్నారు. గ్రామస్తులతోపాటు వివిధ ప్రాంతాల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.