Korukanti Chander | కోల్ సిటీ, సెప్టెంబర్ 22: కళాకారులకు అభిమానుల ప్రశంసలే ఆయువుపట్టు అనీ, కళాకారులను గుర్తించి వారిని గౌరవిస్తూ సమాజంకు పరిచయం చేస్తున్న వసుంధర విజ్ఞానిక వికాస మండలి వ్యవస్థాపకుడు మధు ధర్మారెడ్డి ప్రయత్నం హర్షణీయమని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈమేరకు హైదరాబాద్ లో సోమవారం రవీంద్రభారతిలో వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ భాష సదస్సు జాతీయ స్ఫూర్తి పురస్కారాలను తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డితో కలిసి చందర్ పలువురికి పురస్కారాలను అందజేశారు.
ఆయన మాట్లాడుతూ తెలంగాణ భాషా, యాసకు ప్రపంచమే దాసోమైందన్నారు. ప్రపంచ దేశాల్లో తెలుగువారికి ఉన్న గౌరవం మరే దేశానికి లేదన్నారు. అందునా తెలంగాణ యాసతో మాట్లాడేవారంటే ఆసక్తిగా గుర్తిస్తారన్నారు. వివిధ రంగాల్లో తన ప్రతిభను చాటుతున్న వారిని గుర్తించి మధు ధర్మారెడ్డి పురస్కారాలు ఇవ్వడం పట్ల అభినందించారు. బొగ్గు గనుల ప్రాంతం నుంచి తనను ఈ అవార్డుల ప్రదానోత్సవంకు అతిథిగా పిలవడం గర్వించదగ్గ విషయమన్నారు.