కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 13 : సివిల్ సర్వీసెస్లో అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తామని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
150 మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తామని, వంద మందిని ఆన్లైన్ స్క్రీనింగ్ ద్వారా, మరో 50 మందిని గతంలో యూపీఎస్సీ ద్వారా నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని గుర్తించి నేరుగా శిక్షణకు తీసుకుంటామని వెల్లడించారు. శిక్షణ తరగతులు జూలై 25 నుంచి ఏప్రిల్ 30 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఎంపికైన వారికి లాడ్జింగ్, భోజన, రవాణా ప్రయోజనాల కోసం నెలకు 5 వేలు, పుస్తకాల కోసం మరో 5 వేలు అందిస్తామని తెలిపారు. ఔత్సాహికులు ఈ నెల 16 నుంచి జూలై 8 వరకు www.tgbcstudy circle.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.