Bhubharati Applications | సారంగాపూర్, సెప్టెంబర్ 6: భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చి దరఖాస్తులు, సాదాబైనామాల దరఖాస్తులను పరిశీలించి త్వరగా సమస్యలు పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. తహసీల్దార్ కార్యలయాన్ని శనివారం సందర్శించి భూరికార్డులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. భూభారతి రెవెన్యూ సదస్సుల దరఖాస్తులు పరిశీలించి త్వరగా సమస్యలు పరిష్కరించాలని అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలించి వివరాలు తెల్సుకున్నారు.
అసుపత్రిలోని రికార్డులను, మందులను, అసుపత్రి పరిసరాలను, గదులను పరిశీలించి. పలు సూచనలు చేశారు. వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించాలన్నారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను ఏమైన ఉన్నాయ అని అడిగి తెల్సుకున్నారు. పాఠశాల తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు ఇష్టపడి చుదువుకుని మంచి ఫలితాలు తీసుకురాచాలని సూచించారు. పాఠశాల నిర్వహణపై సంతృత్తిని వ్యక్తం చేశారు. .
అనంతరం మండల కేంద్రం శివారులోని నాయకపు గూడెం గ్రామంలో పైలెట్ ప్రాజెక్ట్రికింది చేపడుతున్న ఇందరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి వివరాలు తెల్సుకున్నారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ వహిదొద్దిన్, ఎంపీడీవో చౌదరపు గంగాధర్, మండల వైద్యాధికారి రాధ రెడ్డి, ఇన్చార్జి ఎంపీవో సర్వశ్రేష్ట, ఆర్ ఐ వెంకటేష్, కస్తూరిభ ప్రత్యేక అధికారి వీణ, స్టాఫ్ నర్సు దామోదర్, పంచాయతీ కార్యదర్యులు, ఉపాద్యాయులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.