Applications | తిమ్మాపూర్, మార్చి2 : వరంగల్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ హానర్స్ విద్యార్థులకు బోధించేందుకు ఒక పోస్టుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిమ్మాపూర్లోని మహాత్మాజ్యోతిభాపూలే అగ్రికల్చర్ మహిళా గురుకులం కళాశాల డీన్ నర్సింహారెడ్డి తెలిపారు.
ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు పీహెచ్ఏ, ఎంఎస్సీ అగ్రికల్చర్, ఎంటెక్ అగ్రికల్చర్ విద్యార్హతలు ఉన్నవారు ఈనెల9న విద్యార్హత ధృవీకరణ పత్రాలతో తిమ్మాపూర్లోని గురుకుల కళాశాలలో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7680964654 నంబరులో సంప్రదించవచ్చని చెప్పారు.