విద్యానగర్, జూలై 16: సినీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బుధవారం కరీంనగరంలో మెరిశారు. జిల్లాకేంద్రంలోని ఉస్మాన్పురలో వాహిని షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమె, పెద్దసంఖ్యలతో తరలివచ్చిన అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం ఓం ప్రకాశ్జీ జాజు (జాజు శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్) చేతుల మీదుగా షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన చేశారు.
షాపులో చీరెలను పరిశీలిస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ యజమాని వేముల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తమ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి తరలివచ్చిన కస్టమర్లు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని కోరారు. కార్యక్రమంలో వేణు భాయ్ జాజు, కమల్ భాయ్ జాజు, వేముల శ్రీనివాస్, విష్ణు, దేవరాజ్, నాగరాజ్, శ్రీకాంత్, మెండే అనిల్ కుమార్, గడ్డం అభిషేక్, కొమురవెల్లి రవితేజ, గాజుల అరుణ్ కుమార్, ప్రశాంత్, దీకొండ రాజు తదితరులు పాల్గొన్నారు.