కరీనగర్ రూరల్, నవంబర్ 9 : కరీంనగర్ మండలం బొమ్మకల్ గ్రామంలోని చల్మెడ ఆనందరావు వైద్య కళాశాలలో అనుతమ-2024 పేరుతో శనివారం నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు అలరించాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ కోన ఎస్ లక్ష్మీకుమారి హాజరై కళాశాల చైర్మన్ చల్మెడ లక్ష్మీనరసింహారావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ కోన ఎస్ లక్ష్మీకుమారి మాట్లాడుతూ వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వైద్య విద్యార్థులు అనునిత్యం విజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మెడికోలు తమ ఆటాపాటతో హోరెత్తించారు. పలు సంప్రదాయ పద్ధతుల నృత్యాలతో అలరించారు. వేడుకల్లో ప్రిన్సిపాల్ డాక్టర్ అసీమ్ అల్లీ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ టి అనిత, అంకాలజీ హెచ్వోడీ డాక్టర్ ఎజీలాసీ, జనరల్ మెడిసిన్ హెచ్వోడీ డాక్టర్ సంజయ్, తదితరులు పాల్గొన్నారు.