కొడిమ్యాల(మల్యాల), డిసెంబర్ 29 : కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ హుండీ ఆదా యం సుమారు రూ.63 లక్షలు వచ్చినట్లు ఈవో వెంకటేశ్ తెలిపారు. ఆలయంలో గురువారం 42 రోజులకు సంబంధించిన హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఇందులో రూ.62, 87, 525 నగదు, విదేశీ కరెన్సీ నోట్లు 26, మిశ్రమ బంగారం 28 గ్రాములు , మూడున్నర తులాల వెండి సమకూరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మారుతీ స్వామి, ధర్మకర్తల మండలి సభ్యులు జున్ను సురేందర్, దేవాదాయ సహాయ కమిషనర్ చంద్రశేఖర్, సూపరింటెండెంట్ సునీల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సంపత్ తదితరులు ఉన్నారు.