Additional responsibilities | మల్లాపూర్, జూలై 5: గ్రామాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లకు అదనంగా బాధ్యతలు అప్పగిస్తున్నారని, ఈ బాధ్యతలు తమకు వెంటనే మినహయించాలని కోరుతూ అంగన్వాడి టీచర్ల సంఘం మండలాధ్యక్షురాలు అల్లాడి శ్యామల ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్ రమేష్ గౌడ్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య పెంచడం, గర్భీణీలు, బాలింతలకు పౌష్టిక ఆహరం పంపీణీ తదితర పనులు ఉంటాయాని తెలిపారు. అలాగే ఇప్పటికే సంబదిత రాష్ట్ర ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికి క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని పేర్కోన్నారు. ఇక్కడ సంఘం కార్యదర్శి లావణ్య, సభ్యురాళ్లు సంధ్య, రజిత, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.