Godavarikhani | ఫర్టిలైజర్ సిటీ, డిసెంబర్ 28 : హాయ్ రాజేష్.. ఏంట్రా ఇలా మారిపోయావ్… అస్సలు గుర్తు పట్టలేదు తెలుసా..ఇలాంటి పలకరింపులతో ఆ పూర్వ విద్యార్థులు మంత్రముగ్ధులయ్యారు. 25 యేళ్ల తర్వాత ఒకరికొకరు కలుసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరి మంచి చెడు ఒకరు తెలుసుకొని ఆనందంగా గడిపారు. గోదావరిఖని మార్కండేయ కాలనీలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ లో 1999లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఈమేరకు ఆదివారం స్థానిక ఓ ఫంక్షన్ హాలులో పూర్వ సమ్మేళనం ద్వారా అంతా ఒకే వేదికపై కలుసుకొని మైమరచిపోయారు. చిన్ననాడు తరగతి గదిలోని జ్ఞాపకాలను నెమరువేసుకొని సిల్వర్ జూబ్లీ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.
చదువు నేర్పిన పూర్వ గురువులను కృతజ్ఞతగా శాలువాలతో సన్మానించారు. ఎక్కడెక్కడో స్థిరపడిన పూర్వ విద్యార్థులను కలుసుకొని ఈ సమ్మేళనంకు శ్రమించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ పోరండ్ల మధు, ఉపాధ్యాయులు మల్లికార్జున్, నాగరాజు, రమేష్, సత్యనారాయణ తోపాటు పూర్వ విద్యార్థులు సుకాంత్, రవీ, సతీష్, రషీద్, రాజేష్, శ్రీలత రెడ్డి, మాధవి తదితరులు పాల్గొన్నారు.